తెలంగాణా లో ప్రస్తుతానికి బలమైన ప్రతి పక్షం లేదనే చెప్పాలి . ఇక కెసిఆర్ పాలన అర్థం కాని విధంగా ఉంది. సర్వే పేరుతో ,ఆహార భద్రతా కార్డులు అని ,కులం ,నివాసం సర్టిఫికెట్స్ అని కాలం గడుపుతున్నారు .
పేదలకు డబల్ బెడ్ రూం ఇల్లు అనేది కూడా ఒక కల గానే మిగులుతుంది . ఎందుకంటే అవి ఒక గుంట భూమి లేని వారికి మాత్రమే కట్టిచ్చి ఇస్తారట ,ఈ లెక్కన మండలానికి పది మంది లబ్ది దారులు కూడా ఉండక పోవచ్చు .
ఇక నిర్భంద విద్య గురించి వచ్చే సంవత్సరం ఆలోచన చేస్తారట ఎప్పుడో మొదలు కావాల్సిన మోడల్ స్కూల్స్ ఇప్పటికి పూర్తి స్థాయి లో నడవడం లేదు ,ఈటెల రాజేందర్ హుజురాబాద్ లోనే మోడల్ స్కూల్లేదు అలాంటిది ప్రైవేటు స్కూల్ ల ఆదిపత్యాన్ని ఎదురించి నిర్భంద విద్య ను కొనసాగిస్తారా అంటే డౌటే అన్పిస్తుంది ,ఋణ మాఫీ అని చెప్పి 25% మాత్రమే చెల్లించారు , మూత పడిన ప్రభుత్వ స్కూల్స్ ఓపెన్ చేసి మేము ప్రస్తుతానికి వీటిలోనే నిర్భంద విద్య ను అందిస్తామంటే ఇక పాత కథే .
వీటి నే అస్త్రాలు గా చేసుకొని కతులు దుసేందుకు ప్రతి పక్షాలు సిద్దముగా ఉన్నాయి . ప్రజాస్వామ్యం లో బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజలకు న్యాయం జరగడం కలే అవుతుంది .
Read More