ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY ) తో ఒక్కసారి గా బ్యాంకు అధికారులు గ్రామాల్లో సేవింగ్స్ ఖాతాలు తెరిపించేందుకు బయలుదేరారు . రిజర్వు బ్యాంకు కూడా సేవింగ్ అకౌంట్ కు సంబంధించి కొన్ని నిమంధనలను సడలించింది . దేశంలోని ప్రతి మనిషి బ్యాంకు ఖాతా కల్గి ఉండాలనే సదుద్దేశంతో భారత ప్రధాని మోడీ ఎర్రకోట పై ఈ స్కీం ను ప్రవేశపెట్టారు .
PMJDY ఖాతా కల్గిన వ్యక్తి చనిపోతే 1 లక్ష బీమా సదుపాయం ఉంటుంది . దీనితో బ్యాంకు లు పోటి పడి ఊర్లలో చాటింపు వేసి ఖాతాలను తెరుస్తున్నారు . ఇప్పటికే మైక్రో బ్యాంకింగ్ తో కొన్ని బ్యాంకు లు మహాత్మాగాంధీ జాతీయ ఉపాది హామీ పథకం సంబందించిన చెల్లింపులు చేస్తున్నాయి .
కొత్త లో SIM కార్డు కోసం కూడా అమౌంట్ ఛార్జ్ చేసేవారు టెలికాం ఆపరేటర్లు , వచ్చే కాల్స్ కు కూడా ఛార్జ్ చేసేవారు , తర్వాత వచ్చిన పోటి వల్ల అన్ని ఫ్రీ గా ఇస్తున్నారు .
సేవింగ్ ఎకౌంటు ఓపెన్ చేయాలంటే బ్యాంకు ల కు వెళ్ళే పరిస్థితి గ్రామీణుల్లో ఆసక్తి తక్కువ , వాళ్ళు పెట్టె షరతులు అలాంటివి . ఇప్పుడు ఏదైనా ఓకే ఫోటో ఐడి ఉంటె సరిపోతుంది .
ఇప్పటి వరకు ICICI బ్యాంకు 1 లక్ష ,IDBI బ్యాంకు 3. 50 లక్షల ఖాతాలను PMJDY కింద ఓపెన్ చేయడం జరిగింది .
