టీవీ 9 క్రైమ్ న్యూస్ యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్ తో మీడియా పేరుతో సమాజంలో ఎం జరుగుతుందో జనాలకు తెలిసి వచ్చింది . ఒకప్పుడు రిపోర్టర్లు ఎప్పుడు ప్రజల సమస్యల పై పోరాడే వారు . ఇప్పటి తరంలో కొందరు కేవలం paid న్యూస్ ను మాత్రమే ప్రెసెంట్ చేస్తున్నారు . ఈ రోజుల్లో మండల స్థాయి విలేకరి అంటే ఆ హోదా వేరు ఎప్పుడు పోలీస్ ల టచ్ లో ఉండటం చిన్న చితక కేసు అయితే మధ్యవర్తిత్వం వహించడం సాదారణ విషయం . ఒకప్పుడు రౌడి లు మాములు వసూలు చేసేవారు ,ఇపుడు రౌడీలకు అంత సీన్ లేదు ఎందుకంటే ఎవరైనా పోలీస్ ల కు ఫోన్ చేస్తే వీని తాట తీస్తరు ,అదే పోలీస్ ల తో రోజు టచ్ లో ఉండే రౌడి ల్లాంటి వాళ్ళైతే సమస్య ఉండదు . ఏదో సినిమా మీటింగ్ లో తన కవర్ తనకు రాలేదని మీడియా మిత్రులు గొడవ పడడం వెబ్ మీడియా లో వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది
ఎన్ని సమస్యలున్న ఎప్పటికి ఒకే రకం వార్తలు రావడం మనం చూస్తుంటాం . స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఫీజులు ఎక్కువైన నానా యాగి చేస్తరు తరువాత కొన్ని రోజులకు కామ్ ఐపోతరు ఎందుకో అర్థం కాదు . ప్రతి మండల కేంద్రం లో వేలాది అక్రమ ఫైనాన్సు కంపెనీ లు నడుస్తున్నాయి ,3 నుండి 15 రూపాయల వరకు వడ్డీ కి ఇవ్వడం తీసుకున్న వ్యక్తి ఇవ్వక పోతే పోలీస్ స్టేషన్ కు రావడం రోజు జరిగే తంతే కాని ఈ వార్త ల ను ప్రచారం చేసి ప్రజలను వాటి భారి నుండి రక్షించే పని చేయరు . రేషన్ బియ్యాన్ని సిల్క్ పాలిష్ చేసి తిరిగి మార్కెట్ కు అమ్మే విషయాలు రిపోర్టర్ల కు తెలియకుండా ఉంటుందా ,నీలి కిరోసిన్ ను పెట్రోల్ పంప్ ల కు సరఫరా చేయడం ఇది సమత్సరాలుగా దాదాపు అన్ని మండల స్థాయి లో జరుగుతున్న వ్యవహారం ,ఈ వార్తలు రావు ఎందుకంటే ఆయ వ్యక్తులు ప్రముఖ న్యూస్ రిపోర్టర్ల తో టచ్ లో ఉంటారు కాబట్టి . ఒక న్యూస్ యాంకర్ 5 కోట్లు డిమాండ్ చేస్తే ఓనర్ పరిస్థితి ఏందీ . ఒక ఛానల్ పెట్టి అనతి కాలం లోనే అన్ని భాషలకు విస్తరించవచ్చు
