Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India
Monday, September 29, 2014
Sunday, September 28, 2014
Saturday, September 27, 2014
Samsung launches Galaxy Alpha at Rs.39990
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు 4 ఏళ్ళ జైలు శిక్ష
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం అక్రమ ఆస్తులు కల్గి ఉన్న కేసు లో 4 ఏళ్ళ జైలు శిక్ష మరియు 100 కోట్ల జరిమానా విధించింది ,దీనితో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంది . దీనితో తమిళనాడు లో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి . ఈ పరిణామాల నేపద్యం లో తమిళనాడు కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరని తేలాల్సి ఉంది . పన్నీరు సెల్వం కు అవకాశం ఉంది .
Friday, September 26, 2014
వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ
కెసిఆర్ వరంగల్ జిల్లా కు ఆరోగ్య యూనివర్సిటీ ని ప్రకటించారు .దీనికి కాలోజి యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ గా నామకరణం చేశారు . దీనితో మెడికల్ కాలేజీ ల ఏర్పాటు కు ,సిబ్బంది నియమాలకు నతర్ యూనివర్సిటీ పై ఆధారపడే అవుసరం ఉండదు . దీనితో వరంగల్ ప్రజలు సంతోషం గా ఉన్నారు . కాకతీయ మెడికల్ కాలేజీ కి 163 ఎకరాలు ఉండడం ,అది చాలకుంటే పక్కనే ఉన్న సెంట్రల్ జైలు ను వేరే ప్రదేశానికి తరలించి ఆ భూమిని వాడుకునే వీలుంది . దీనితో MGM సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ మారిపోతుంది .
Thursday, September 25, 2014
కొంప ముంచుతున్న అమెరికా నిరుద్యోగుల సంఖ్య
8:27 AM
ఈ రోజు భారత దేశ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి . ఈ రోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఈ నెల గడువు ముగింపు ఉండడం వాళ్ళ ఇన్వెస్టర్లు లాభాల ను స్వీకరించారు .
నిఫ్టీ 90 పాయింట్లు నష్ట పొగా సెన్సెక్స్ 276 పాయింట్లు నష్టపోయాయి .
ఈ రోజు అమెరికా ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడం తో అమెరికా మరియు మార్కెట్లు ఒక్క సారిగా కుప్ప కులాయి .
డౌజోన్స్ 1. 21% ,S & P 500 1.27% మరియు నాస్డాక్ 1.66% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి .
అదే విధంగా FTSE 1.13% మరియు CAC 1. 7% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి .
అసలే ప్రపంచ మార్కెట్లు అన్ని అల్ టైం హై లో ఉన్న సమయం లో ఈ వార్త ఇన్వెస్టర్ ల ను కలువర పెడుతుంది .
Wednesday, September 24, 2014
Monday, September 22, 2014
మాట నిలుపుకున్న కెసిఆర్
కెసిఆర్ నేడు ఋణ మాఫీ కి సంబంధించి మొదటి విడుత నిధులను విడుదల చేశారు . దీనితో మేనిఫెస్టో లో ఇచిన మాట ను నిలబెట్టుకున్నారు . ప్రతి రైతు కు లక్ష లోపు ఋణాలను మాఫీ చేశారు . దీనితో రైతులు తెలంగాణా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు . ఇంకా ఆదర్శ రైతు విధానాన్ని రద్దు చేశారు . సింగరేణి కార్మికులకు పండుగ బోనస్ ప్రకటించారు .
Saturday, September 20, 2014
తెలంగాణ కు 14 వ ఆర్థిక సంఘం భరోస
కొత్త గా ఏర్పడిన రాష్ట్రానికి అనేక సవాల్లున్నాయని వాటిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం లోని 25 శాఖలకు కేంద్రం నుంచి గ్రాంట్లు గ రూ . 23,475.34 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 14 వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది .
చెరువుల పునరుద్ధరణకు ,వాటర్ గ్రిడ్ ల నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి , సంక్షేమ పథకాల అమలుకు ఇతోధికంగా నిధులు కేటాయించాలని కోరారు .
వెనుకబడిన కులాలకు సమగ్రాభివృద్ది కి ఐదేళ్ళ కాలం లో 25,000 కోట్లు , ఎస్సి ల కోసం 50,000 కోట్లు ఖర్చు చేస్తామని కెసిఆర్ ఆర్థిక సంఘానికి వివరించారు .
ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం తో పని చేస్తుందని 14 వ ఆర్ధిక సంఘం చైర్మన్ డాక్టర్ వై వి రెడ్డి ప్రశంసించారు . అవసరాల మేరకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు .
Wednesday, September 17, 2014
YES కు వణుకుతున్న స్టాక్ మార్కెట్లు
నేడు జరిగే స్వతంత్ర స్కాట్లాండ్ వోటింగ్ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది 300 ఏళ్ళ కు పైగా బ్రిటన్ తో కలిసి ఉన్న స్కాట్లాండ్ విడిపోతే ఆ ప్రభావం రాజకీయాల పై పడుతుంది . ప్రస్తుత ప్రధాని రాజీనామా చేయాల్సి వస్తుంది . దీనితో రాజకీయ అనిశ్చితి తో బ్రిటన్ పరిస్థితి మారి పోతుంది . గత కొద్ది వారాలుగా మార్కెట్ లు స్తబ్దుగా ఉన్న విపరీతమైన ఒడిదుడుకుల కు లోనయ్యే ప్రమాదం ఉంది . అసలే అల్ టైం లో ఉన్న మార్కెట్లు కరెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది . నిఫ్టీ 8000 క్రింద అవ్వడం చూస్తే రానున్న రోజుల్లో 7660 చేరుకోవచ్చు .
ఈ రోజు మార్కెట్ లు నష్టాలతో ప్రారంభం అవుతాయి .
SGX నిఫ్టీ -35 పాయింట్ల వద్ద అవుతుంది .
AAGADU
7:13 AM
AAGADU POSTERS,
AAGADU TRAILERS,
AGADU MOVIE,
MAHESH BABU,
SRINU VAITLA,
SS THAMAN,
TAMANNAH
AGADU
AGADU
Tuesday, September 16, 2014
మెదక్ లో దుమ్ము రేపిన తెరాస
మెదక్ లోకసభ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,61,236 ఓట్ల బంపర్ మెజారిటీ తో గెలుపొందారు .
ఈ విజయం తో తెలంగాణా లో తెరాస కు తిరుగులేదని క్రిస్టల్ క్లియర్ గా అర్థం అయింది . ఈ విజయం వెనుక హరీష్ రావు కృషి ఎంతో ఉంది . అందరు విజయం కోసం చూస్తే హరీష్ రావు బంపర్ మెజారిటీ కోసం చూసి సాధించారు .
'I' TEASER
Shankar's I teaser is rocking in you tube ,this video gets 13 lakhs hits
It seems to create history in Indian cinema..
Sunday, September 14, 2014
Friday, September 12, 2014
మళ్లీ సీన్ లోకి వచ్చిన మందకృష్ణ
7:59 AM
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాల మందికి పని లేకుండా పోయింది పైగా అపోజిషన్ వాళ్ళ కు కూడా , ఏది చేద్దామన్న కొండను డీ కొట్టి న ఎలుక పరిస్థితి లా ఉంది . అసలే కొత్త ప్రభుత్వం అందునా కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు , లగడపాటి లాంటి వల్లే రాజకీయ సన్యాసం తీసుకున్నారు .
దళితున్ని ఉప ముఖ్యమంత్రి ని చేసిన కెసిఆర్ ను పొగిడిన వాళ్ళెంత మందో తెలియదు కానీ పిలవని పేరంటానికి వెళ్లినట్టు మందకృష్ణ రాజయ్య విషయం లో దూరి కులం పేరుతో నానా యాగి చేస్తున్నాడు ,నిజానికి కులం సేవ చేయాలంటే ఎన్నో మార్గాలున్నాయి ఉప ముఖ్యమంత్రి తో కలిసి తన కుల సమస్యల ను పరిష్కరించుకుంటే అది కులానికి మంచిది చేసినందుకు అతనికి పేరు ఉంటది . ఎవరికీ ఉపయోగపడని పని ఎందుకు .
తన రాజకీయానికి మాత్రమె కులాన్ని ఉపయోగించే నాయకులను కులం కూడా క్షమించదు .
కెసిఆర్ నాకు తండ్రి లాంటి వాడు కొడుకును అన్నట్టు అన్నడు అందులో తప్పేం లేదు అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ మందకృష్ణ సీన్ లోకి ఎందుకు వచినట్లో అందరికి తెలిసిన సత్యమే .. పోలవరం ముంపు మండలాలను కలుపుకొని తెలంగాణా లో మొఖం లేని రాజకీయ పార్టీ లు కొత్త గా ఒక రాజకీయ చదరంగాన్ని నడుపాలి అది కూడా కులం పేరు తో చేస్తే ఆ కులం వాళ్ళ మద్దతు కూడా ఉంటది .. ఆట అప్పుడు ఈజీ గా ఉంటది చివరాకరకు ఈ నాటకం నడిపిన వ్యక్తి కి డబ్బో లేదా ఓ పదవి పడేస్తే సరి .. ఇవి నక్క జితుల తెలుగు బాబు కు తెలువని విద్య కాదు .
సమాజం మారి పోతుంది మనం మారాలి ఇంకా ఆంధ్ర పార్టీ ల తోతుల కు ఇక్కడ ఎవరు మదతు ఇస్తరు . కులం మంచి కోరి కులానికి ఉపయోగపడే పనులు చేస్తే మంచిది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకుంటే ఆ కులం వాళ్ళు కూడా క్షమించరు .
Monday, September 8, 2014
మీడియా లో అవినీతికి వికృత రూపం
7:12 AM
టీవీ 9 క్రైమ్ న్యూస్ యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్ తో మీడియా పేరుతో సమాజంలో ఎం జరుగుతుందో జనాలకు తెలిసి వచ్చింది . ఒకప్పుడు రిపోర్టర్లు ఎప్పుడు ప్రజల సమస్యల పై పోరాడే వారు . ఇప్పటి తరంలో కొందరు కేవలం paid న్యూస్ ను మాత్రమే ప్రెసెంట్ చేస్తున్నారు . ఈ రోజుల్లో మండల స్థాయి విలేకరి అంటే ఆ హోదా వేరు ఎప్పుడు పోలీస్ ల టచ్ లో ఉండటం చిన్న చితక కేసు అయితే మధ్యవర్తిత్వం వహించడం సాదారణ విషయం . ఒకప్పుడు రౌడి లు మాములు వసూలు చేసేవారు ,ఇపుడు రౌడీలకు అంత సీన్ లేదు ఎందుకంటే ఎవరైనా పోలీస్ ల కు ఫోన్ చేస్తే వీని తాట తీస్తరు ,అదే పోలీస్ ల తో రోజు టచ్ లో ఉండే రౌడి ల్లాంటి వాళ్ళైతే సమస్య ఉండదు . ఏదో సినిమా మీటింగ్ లో తన కవర్ తనకు రాలేదని మీడియా మిత్రులు గొడవ పడడం వెబ్ మీడియా లో వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది
ఎన్ని సమస్యలున్న ఎప్పటికి ఒకే రకం వార్తలు రావడం మనం చూస్తుంటాం . స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఫీజులు ఎక్కువైన నానా యాగి చేస్తరు తరువాత కొన్ని రోజులకు కామ్ ఐపోతరు ఎందుకో అర్థం కాదు . ప్రతి మండల కేంద్రం లో వేలాది అక్రమ ఫైనాన్సు కంపెనీ లు నడుస్తున్నాయి ,3 నుండి 15 రూపాయల వరకు వడ్డీ కి ఇవ్వడం తీసుకున్న వ్యక్తి ఇవ్వక పోతే పోలీస్ స్టేషన్ కు రావడం రోజు జరిగే తంతే కాని ఈ వార్త ల ను ప్రచారం చేసి ప్రజలను వాటి భారి నుండి రక్షించే పని చేయరు . రేషన్ బియ్యాన్ని సిల్క్ పాలిష్ చేసి తిరిగి మార్కెట్ కు అమ్మే విషయాలు రిపోర్టర్ల కు తెలియకుండా ఉంటుందా ,నీలి కిరోసిన్ ను పెట్రోల్ పంప్ ల కు సరఫరా చేయడం ఇది సమత్సరాలుగా దాదాపు అన్ని మండల స్థాయి లో జరుగుతున్న వ్యవహారం ,ఈ వార్తలు రావు ఎందుకంటే ఆయ వ్యక్తులు ప్రముఖ న్యూస్ రిపోర్టర్ల తో టచ్ లో ఉంటారు కాబట్టి . ఒక న్యూస్ యాంకర్ 5 కోట్లు డిమాండ్ చేస్తే ఓనర్ పరిస్థితి ఏందీ . ఒక ఛానల్ పెట్టి అనతి కాలం లోనే అన్ని భాషలకు విస్తరించవచ్చు
Sunday, September 7, 2014
US ఓపెన్ లో గెలిచిన సానియా మిర్జా
US ఓపెన్ mixed doubles లో బ్రెజిల్ కు చెందిన బ్రూనో సోర్సు తో కలిసి సానియా మిర్జా విజయం సాధించి తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది . కెసిఆర్ సానియా ను తెలంగాణ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన తర్వాత తన పై ఆరోపణలు చేసిన వారికి తన బాట్ తో సమాధానం ఇచ్చి వారి నోర్లు మూయించింది .
ఫైనల్లో గెలిచిన తర్వాత సానియా మాట్లాడుతూ " ఈ విజయాన్ని దేశం లోని ప్రతి ఒక్కరికి . తెలంగాణ రాష్ట్రానికి అక్కడి ప్రజలకు అంకితమిస్తున్నా అని పేర్కొంది . కల నిజమైందని తెలంగాణ బ్రాండ్ అంబాసిడార్ కావడం గర్వం గా ఉందని తెలిపింది" .



























