Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Friday, September 12, 2014

మళ్లీ సీన్ లోకి వచ్చిన మందకృష్ణ

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాల మందికి పని లేకుండా పోయింది పైగా అపోజిషన్ వాళ్ళ కు కూడా , ఏది చేద్దామన్న కొండను డీ కొట్టి న ఎలుక  పరిస్థితి లా  ఉంది  . అసలే కొత్త ప్రభుత్వం అందునా కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు , లగడపాటి లాంటి వల్లే రాజకీయ సన్యాసం తీసుకున్నారు . 

దళితున్ని ఉప ముఖ్యమంత్రి ని చేసిన కెసిఆర్ ను పొగిడిన వాళ్ళెంత మందో తెలియదు కానీ పిలవని పేరంటానికి వెళ్లినట్టు మందకృష్ణ రాజయ్య విషయం లో దూరి కులం పేరుతో నానా యాగి చేస్తున్నాడు ,నిజానికి కులం సేవ చేయాలంటే ఎన్నో మార్గాలున్నాయి ఉప ముఖ్యమంత్రి తో కలిసి తన కుల సమస్యల ను పరిష్కరించుకుంటే అది కులానికి మంచిది చేసినందుకు అతనికి పేరు ఉంటది . ఎవరికీ ఉపయోగపడని పని ఎందుకు . 
తన రాజకీయానికి మాత్రమె కులాన్ని ఉపయోగించే నాయకులను కులం కూడా క్షమించదు . 
కెసిఆర్ నాకు తండ్రి లాంటి వాడు కొడుకును అన్నట్టు అన్నడు అందులో తప్పేం లేదు అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ మందకృష్ణ సీన్ లోకి ఎందుకు వచినట్లో అందరికి తెలిసిన సత్యమే .. పోలవరం ముంపు మండలాలను కలుపుకొని తెలంగాణా లో మొఖం లేని రాజకీయ పార్టీ లు కొత్త గా ఒక రాజకీయ చదరంగాన్ని నడుపాలి అది కూడా కులం పేరు తో చేస్తే ఆ కులం వాళ్ళ మద్దతు కూడా ఉంటది .. ఆట అప్పుడు ఈజీ గా ఉంటది చివరాకరకు ఈ నాటకం నడిపిన వ్యక్తి కి డబ్బో లేదా ఓ పదవి పడేస్తే సరి .. ఇవి నక్క జితుల తెలుగు బాబు కు తెలువని విద్య కాదు . 

సమాజం మారి పోతుంది మనం మారాలి ఇంకా ఆంధ్ర పార్టీ ల తోతుల కు ఇక్కడ ఎవరు మదతు ఇస్తరు  . కులం మంచి కోరి కులానికి ఉపయోగపడే పనులు  చేస్తే మంచిది.  కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకుంటే ఆ కులం వాళ్ళు కూడా క్షమించరు . 



  

Read More

Monday, September 8, 2014

మీడియా లో అవినీతికి వికృత రూపం

టీవీ 9 క్రైమ్ న్యూస్ యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్ తో మీడియా పేరుతో సమాజంలో ఎం జరుగుతుందో జనాలకు తెలిసి వచ్చింది . ఒకప్పుడు రిపోర్టర్లు ఎప్పుడు ప్రజల సమస్యల పై పోరాడే వారు . ఇప్పటి తరంలో కొందరు కేవలం paid న్యూస్ ను మాత్రమే ప్రెసెంట్ చేస్తున్నారు . ఈ రోజుల్లో మండల స్థాయి విలేకరి అంటే ఆ హోదా వేరు ఎప్పుడు పోలీస్ ల టచ్ లో ఉండటం చిన్న చితక కేసు అయితే మధ్యవర్తిత్వం వహించడం సాదారణ విషయం . ఒకప్పుడు రౌడి లు మాములు వసూలు చేసేవారు ,ఇపుడు రౌడీలకు అంత సీన్ లేదు ఎందుకంటే ఎవరైనా పోలీస్ ల కు ఫోన్ చేస్తే వీని తాట తీస్తరు ,అదే పోలీస్ ల తో రోజు టచ్ లో ఉండే రౌడి ల్లాంటి వాళ్ళైతే సమస్య ఉండదు . ఏదో సినిమా మీటింగ్ లో తన కవర్ తనకు రాలేదని మీడియా మిత్రులు గొడవ పడడం వెబ్ మీడియా లో వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది 
ఎన్ని సమస్యలున్న ఎప్పటికి ఒకే రకం వార్తలు రావడం మనం చూస్తుంటాం . స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఫీజులు ఎక్కువైన నానా యాగి చేస్తరు తరువాత కొన్ని రోజులకు కామ్ ఐపోతరు ఎందుకో అర్థం కాదు . ప్రతి మండల కేంద్రం లో వేలాది అక్రమ ఫైనాన్సు కంపెనీ లు నడుస్తున్నాయి ,3 నుండి 15 రూపాయల వరకు వడ్డీ కి ఇవ్వడం తీసుకున్న వ్యక్తి ఇవ్వక పోతే పోలీస్ స్టేషన్ కు రావడం రోజు జరిగే తంతే కాని ఈ వార్త ల ను ప్రచారం చేసి ప్రజలను వాటి భారి నుండి రక్షించే పని చేయరు . రేషన్ బియ్యాన్ని సిల్క్ పాలిష్ చేసి తిరిగి మార్కెట్ కు అమ్మే విషయాలు రిపోర్టర్ల కు తెలియకుండా ఉంటుందా ,నీలి కిరోసిన్ ను పెట్రోల్ పంప్ ల కు సరఫరా చేయడం ఇది సమత్సరాలుగా దాదాపు అన్ని మండల స్థాయి లో జరుగుతున్న వ్యవహారం ,ఈ వార్తలు రావు ఎందుకంటే ఆయ వ్యక్తులు ప్రముఖ న్యూస్ రిపోర్టర్ల తో టచ్ లో ఉంటారు కాబట్టి .  ఒక న్యూస్ యాంకర్ 5 కోట్లు డిమాండ్ చేస్తే ఓనర్ పరిస్థితి ఏందీ . ఒక ఛానల్ పెట్టి అనతి కాలం లోనే అన్ని భాషలకు విస్తరించవచ్చు 





Read More

ఢిల్లీ లో కెసిఆర్ పర్యటన


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ లో  రాష్ట్రపతి ని  ,ప్రధాన మంత్రి ని మరియు వివిధ శాఖల కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు . రాష్ట్రానికి సంబందించిన వివిధ అంశాల పై కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ ,ప్రకాష్ జవదేకర్ ,స్మృతి ఇరానీ ,పియూష్ గోయల్ ల తో సమావేశమై చర్చించారు .  

Read More

Sunday, September 7, 2014

US ఓపెన్ లో గెలిచిన సానియా మిర్జా





US ఓపెన్ mixed doubles లో  బ్రెజిల్ కు చెందిన బ్రూనో సోర్సు తో కలిసి  సానియా మిర్జా విజయం సాధించి తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది . కెసిఆర్ సానియా ను తెలంగాణ కు బ్రాండ్ అంబాసిడర్ గా  ప్రకటించిన తర్వాత తన పై ఆరోపణలు చేసిన వారికి తన బాట్ తో సమాధానం ఇచ్చి వారి నోర్లు మూయించింది .

ఫైనల్లో గెలిచిన తర్వాత సానియా మాట్లాడుతూ " ఈ విజయాన్ని  దేశం లోని ప్రతి ఒక్కరికి . తెలంగాణ రాష్ట్రానికి అక్కడి ప్రజలకు అంకితమిస్తున్నా అని పేర్కొంది . కల నిజమైందని తెలంగాణ బ్రాండ్ అంబాసిడార్ కావడం గర్వం గా ఉందని తెలిపింది" .  
Read More

Saturday, August 30, 2014

PRIME MINISTER JAN DHAN YOJANA (PMJDY)





ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY ) తో ఒక్కసారి గా బ్యాంకు అధికారులు గ్రామాల్లో సేవింగ్స్ ఖాతాలు తెరిపించేందుకు బయలుదేరారు . రిజర్వు బ్యాంకు కూడా సేవింగ్ అకౌంట్ కు సంబంధించి కొన్ని నిమంధనలను సడలించింది . దేశంలోని ప్రతి  మనిషి బ్యాంకు ఖాతా కల్గి ఉండాలనే సదుద్దేశంతో భారత ప్రధాని మోడీ ఎర్రకోట పై ఈ స్కీం ను ప్రవేశపెట్టారు .

       PMJDY ఖాతా కల్గిన వ్యక్తి చనిపోతే 1 లక్ష బీమా సదుపాయం ఉంటుంది . దీనితో బ్యాంకు లు పోటి పడి ఊర్లలో చాటింపు వేసి ఖాతాలను తెరుస్తున్నారు . ఇప్పటికే మైక్రో బ్యాంకింగ్ తో కొన్ని బ్యాంకు లు మహాత్మాగాంధీ జాతీయ ఉపాది హామీ పథకం సంబందించిన చెల్లింపులు చేస్తున్నాయి .

     కొత్త లో SIM కార్డు కోసం కూడా అమౌంట్ ఛార్జ్ చేసేవారు టెలికాం ఆపరేటర్లు , వచ్చే కాల్స్ కు కూడా ఛార్జ్ చేసేవారు , తర్వాత  వచ్చిన పోటి వల్ల అన్ని ఫ్రీ గా ఇస్తున్నారు .

   సేవింగ్ ఎకౌంటు ఓపెన్ చేయాలంటే  బ్యాంకు ల కు వెళ్ళే పరిస్థితి గ్రామీణుల్లో ఆసక్తి తక్కువ , వాళ్ళు పెట్టె షరతులు అలాంటివి . ఇప్పుడు ఏదైనా ఓకే ఫోటో ఐడి ఉంటె సరిపోతుంది .  

ఇప్పటి వరకు ICICI బ్యాంకు 1 లక్ష ,IDBI  బ్యాంకు 3. 50 లక్షల ఖాతాలను PMJDY కింద ఓపెన్ చేయడం జరిగింది . 
Read More

Wednesday, August 27, 2014

తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ రావు

తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ రావు 


తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ భాజపా నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు ను భారత ప్రభుత్వం మహారాష్త్ర గవర్నర్ గా నియమించింది . కరీంనగర్ నుండి లోకసభకు పోటి చేసి ఓడి పోయిన విద్యాసాగర్ రావు ను మోడీ ప్రభుత్వం గుర్తించి గవర్నర్ పదవిని ఇవ్వడం శుభపరిణామం . ఎంతో కాలంగా పార్టీ కి ఆయన చేసిన సేవల కు గాను ఈ పదవి వరించింది . రాష్ట్ర శాఖా ఏర్పాటు చేసిన అభినందన సభ లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విద్యాసాగర్ రావు ను అభినందించారు . 

Read More

Sunday, August 24, 2014

ICE BUCKET CHALLENGE IS ROCKING IN INDIA

ఐస్ బకెట్ ఛాలెంజ్ ని మన దేశం లోని సెలెబ్రిటి  లు ఎంజాయ్ చేస్తున్నారు . అమెరికా లోని చారిటి కోసం ఐస్ బకెట్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని అక్కడి సెలబ్రిటీ లు  మరియు కంపెనీ సీఈఓ లు  పాల్గొని విజయవంతం చేసారు . ఆ వీడియోలు సోషల్ మీడియాలో బంపర్ హిట్ ఐయ్యాయి .

Read More

RABHASA TRAILORS


యంగ్ టైగర్ ఎన్టీఆర్  రభస సినిమా ట్రైలర్స్ 




Read More

Saturday, August 23, 2014

దేశం లోని మొదటి గ్రీన్ బస్సు



ఇండియా లోనే మొదటి సారి ఇథనాల్ తో నడిచే గ్రీన్ బస్సు ను నాగపూర్ లో ప్రారంభించారు. దీనిని స్వీడన్ కు చెందిన SCANIA కంపెనీ,ఇది  కమర్షియల్ వెహికల్ మరియు ఇంజిన్లను తయారు చేస్తుంది. సంవత్సరానికి 6 లక్షల కోట్లను పెట్రోల్ మరియు డీజిల్ దిగుమతి కి దేశం ఖర్చు పెడుతుంది , దీనిని 2 లక్షల కోట్లకు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఆధారిత వాహనాలను మరియు ఇథనాల్ ఆధారిత వాహనలకోసం నిధులు వెచ్చిస్తామని నితిన్ గడ్కారి  తెలిపారు . ఈ గ్రీన్ బస్సు ధర రూ . 1 కోటి    టాక్స్ లు లేకుండా . SCANIA కంపెనీ ఈ బస్సు లను   నార్వే  తో పాటు అనేక దేశాలకు సప్లై చేస్తుంది .  

Read More

Friday, August 22, 2014

నేటి తెలంగాణా పోలీస్ హీరో SP రంగనాథ్




ఖమ్మం లో  అనుమతి లేని  వడ్డీ వ్యాపారులపై మరియు ఫైనాన్సు వ్యాపారుల పై ఏక కాలంలో జిల్లా వ్యాప్తంగా SP రంగనాథ్ అధ్వర్యంలో  దాడులు జరగడం రాష్ట్రం లోని అక్రమ వడ్డీ వ్యాపారుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది . 
పాల్వంచ లో ఒక వడ్డీ వ్యాపారి ఇంట్లో 5 కోట్ల విలువైన తాకట్టు బంగారం స్వాదీనం చేసుకోవడం  తో ఏ రీతిన ఈ వ్యాపారం సాగుతుందో తెలిసి పోతుంది. 

రిజర్వు బ్యాంకు నిబందనలు ఉల్లంఘించి ఫైనాన్సు చేస్తున్న వారందరి డేటా ను SP రంగనాథ్  గారు ముందు గా సేకరించి  దాడుల చేయించారు .  ఖాళీ ప్రామిసోరి నోట్ పైన ,స్టాంప్ వేసిన వైట్ పేపర్ పైన సంతకాలు తీసుకోవడం  ఆ తర్వాత ఇష్టం వచ్చిన అమౌంట్ వేసుకొని కోర్ట్ నోటీసులు పంపడం వీరి అరాచకానికి పరాకాష్ట . 

   ఈ దాడుల వల్ల  కొన్ని వందల ఆత్మహత్య లను SP రంగనాథ్ ఆపివేయడం జరిగింది . ఉద్యోగుల దగ్గర నుండి ATM కార్డు లు తీసుకోవడం ,జీతం వచ్చిన తర్వాత వారి అనుమతి లేకుండా లేకుండా డ్రా చేసుకోవడం ,బ్లాంక్ చెక్కులు  పై సంతకం పెట్టించుకోవడం ఇవ్వకుంటే చెక్కు బౌన్సు కేసు పెడుతనని బెదిరించడం అక్రమ వడ్డీ వ్యాపారుల నిత్యకృత్యాలు. 

   వడ్డీ వ్యాపారులను ఎదుర్కోవడం అంటే అది మాములు విషయం కాదు ,వారి అంగ ,అర్థ బలం అలాంటిది 
ఇక రాజకీయ ఒతిళ్ళ గురించి చెప్పనక్కరలేదు .  వీటన్నిటిని లెక్క పెట్టకుండా ప్రజల కు నిస్వార్థంగా సేవ చేస్తున్న SP రంగనాథ్ అభినందనీయుడు. 

 RBI ఈ మధ్యనే అక్రమంగా  34000 కు పైగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సు కంపెనీస్ ఉన్నట్టు పేర్కొంది 
మిగతా జిల్లాల SP లు ఇదే తరహ దాడులు నిర్వహిస్తే మరింత మంది ని అప్పుల ఊబినుండి విముక్తులను చేసినట్టవుతుంది . అసలే కరువు తో నానా ఇబ్బందులు పడుతున్న జనాలకు ఈ అక్రమ వడ్డీ వ్యాపారులండి  అంతులేని నష్టం జరుగుతుంది . వీళ్ళు పెట్టె ఇబ్బందులకు మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది . 

RBI నిబందనలకు లోబడి చేసే వ్యాపారుల వాళ్ళ సమాజానికి ఎలాంటి నష్టం లేదు ,   కాని రూ 3 నుండి రూ 15 వరకు దౌర్జన్యంగా వడ్డీ వసూలు చేసే వారితో తీవ్ర ఆర్ధిక అసమానతలు ఏర్పడ్తాయి .  ఇది తెలంగాణా సమాజనికి 
ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు . 
Read More

Wednesday, August 20, 2014

లక్ష కోట్ల తో డిజిటల్ ఇండియా



దేశం లోని ప్రతి గ్రామపంచాయతి ని హై స్పీడ్ ఇంటర్నెట్ తో అనుసంధానం చేసే 'డిజిటల్ ఇండియా ' కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది . ఈ ప్రణాళిక కోసం లక్ష కోట్లు వెచ్చించి అన్ని రంగాల ప్రభుత్వసేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకోనిరనుంది . దీనిలో భాగంగా ప్రతి మారుమూల గ్రామానికి  విద్య, వైద్యసేవల్లో పురోగతి, డిజిటల్ అక్షరాస్యత ద్వారా గ్రామీణులకు విజ్ఞానాన్ని అందించటం, మొబైల్ కనెక్టివిటీ ,ఈ-గవర్నెన్స్ . ఉద్యోగాల కల్పనా, వ్యవసాయంలో ఐటి వినియోగం మదలైనవి ఈ ప్రణాళిక  లక్ష్యాలు. 
Read More

సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని కెసిఆర్ అన్నారు . దీనివల్ల ప్రజల కు ఎం కావాలో తెలుస్తందని పెర్కొన్నరు. జనసంఖ్య ,అక్రమ ఆస్తులు ,నకేలి రేషన్ కార్డ్స్  వెలుగులోకి వస్తాయి. ప్రాధమిక అంచనాల ప్రకారం 500 కోట్ల అదనపు ఆదాయాన్ని GHMC పొందబోతున్నట్టు తెలిసింది . మండలానికో డేటా సెంటర్ పెట్టి 2 వారాల్లో NIC అద్వర్యంలో పుర్హి డేటా ను అందుబాటులోకి తెస్తారు  



Read More

రేపు సమగ్ర కుటుంబ సర్వే

రేపు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు  తెలంగాణ ప్రభుత్వం  పకడ్బంది ఏర్పాట్లు చేసింది ఒక ఎనుమేరటర్ 30  కుటుంబాలను సర్వే చేయవలసి ఉంటుంది. ఇతర ప్రదేశాలలో నివసించే జనం అంత సొంత ఊళ్లకు చెరుకున్నరు. రేపు 9 గంటల కు అందరు ఇళ్ళ వద్దే ఉండాలని డప్పు చాటింపు చేయించడం జరిగింది.  

Read More

Friday, August 15, 2014

కరువు కోరల్లోకి తెలంగాణ

కరువు కోరల్లోకి తెలంగాణ 



తెలంగాణ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి దాపురించింది  ఆగష్టు నెల సగం గడిచిన వాన దేవుడు కనికరించలెదు. 
పోచమ్మ బోనాల రోజు వర్షం  పడటం ఆనవాయితి కానీ ఈ సారి అది జరుగలేదు బావుల కింద చేసే వ్యవసాయం కూడా ఆశించిన స్థాయిలో పండక పోవచ్చు ఎందుకంటే కరెంటు ప్రాబ్లం వల్ల . మేఘ మధనం లాంటి వేమైన చేస్తారంటే దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా లేదు 

కరువు ను ఇంకా గుర్తించక పోవడం శోచనీయం. కరువు పరిస్థితి వస్తే ఎం చేయాలి రైతులను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక ప్లాన్ వ్యవసాయ అధికారుల కు లేకపోవడం నిజంగా తెలంగాణా ప్రజల బాడ్ లక్. 




Read More

Saturday, August 2, 2014

Country wise Petrol prices per Litre

Pakistan. Rs 26.00Bangladesh Rs 22.00Cuba Rs 19.00Italy. Rs 14.00Nepal. Rs. 34.00Burma. Rs. 30.00Afghanistan. Rs 36.00Sri Lanka. Rs. 34.00INDIA. Rs. 82.00How it comes to this......Basic cost per 1litre. 16.50+ Centre Tax. 11.80%+ Excise Duty. 9.75%+ Vat Cess. 4%+ State Tax. 8%Total added up together becomes Rs 50.05 per 1 litre. + now another Rs 32. Extra. This 32/- extra for what no explaination for this.What a great job by the GOVT. Of INDIA

Read More

Saturday, July 19, 2014

రగిలిపోతున్న ఉస్మానియా విద్యార్థులు



కెసిఆర్ తీరు తో ఉస్మానియా కాంపస్ ఒక్కసారి వేడెక్కింది . కాంట్రాక్టు ఉద్యోగుల ను పెర్మనెంట్ చేస్తామని తెరాస తన మేనిఫెస్టో లో పెట్టిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఉద్యమ  సమయంలో కొత్త ఉద్యోగాల గురించి ఉస్మానియా కాంపస్ లో నేతలు  మాటలు మరిచినట్టున్నారు. నవ తెలంగాణా లో మాకు ఉద్యోగాలు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు కాబినెట్ సమావేశంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటన ల ప్రస్తావన లేకపోవడం తో విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు . కాంట్రాక్టు కార్మికుల ఎంపిక లో పారదర్శికత లోపించడం వలన బ్యాక్ డోర్ ద్వారా ఇతర రాష్ట్రాల  విశ్వ విద్యాలయల నుండి పొందిన డిగ్రీ ల  ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాలు  పొందినట్టు  సమాచారం ,అదే జరిగితే నిజమైన ప్రతిభ కల్గిన విద్యార్థులు జరిగే నష్టం అపారమైనది.  సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరిచడం ఉత్తమం. 


Read More

Monday, July 14, 2014

ITC seeks to Invest Rs.3500 crores in Telangana




Today is ITC  seeks to Invest Rs.3500 crores in Telangana to establish Paper manufacturing Unit. CM office release press note and given promise to provide all facilities including land to Intrested companies. KCR is very happy to announce this news today. After gaining Tata group aviation parts company now Hinduja's Paper Manufacturing Unit will create new job opportunities in Telangana.
This major success of KCR government.

Read More

Microsoft India Chairman meets KCR today




Today Microsoft India Charman Bhaskar Pramanik met KCR in Hyderabad. He wants to work with Telangana government in INCUBATER,TASK,wifi related technologies and explained expansion of microsoft company. There is another meet between micrsoft and govt on August 6.
Read More

Saturday, July 12, 2014

Who are suffering like UDAY KIRAN in tollywood


Most Successful and young talented actor Uday Kiran died of Tollywood dirty politics. All are accepted even Dasari Narayana Rao said this fact before the media,Uday kiran fans publicly announced who are behind the death of their hero. The Four Families are tried to destroy the chances,creating marketing problems for completed films and removing successfully running movies from theaters. Blamed with their paid print,TV and  web media to survival or entry of their up coming family members as hero.

     Before death of Udaykiran AM RATNAM announced a bilingual movie with Uday kiran and dropped after getting pressure from famous producer.Uday kiran given party to his friends after announcing AM RATNAM movie.

 As of now Who are facing same problem in Tollywood

  • NANI
  • GOPICHAND
  • VARUN SANDESH
  • TARUN
  • SRIKANTH
  • RAJA
  • AADI
  • HERO SIVAJI....
enough is enough no more excuses for this Dirty politics and their shape less heirs. There is lot of young talent is TELANGANA state ..Telangana Film Chamber must be establish to save Telangana Talented actors. Hope KCR sir will save the rights of Telangana Film Industry.


Read More

Thursday, July 3, 2014

ప్రపంచానికి మరో వైరస్ ముప్పు

 దక్షిణాఫ్రికా లోని గునియా,సిఎర్రలేయోన్ మరియు లైబీరియా ప్రాంతాలు ఎబోలా వైరస్ బారిన పడ్డాయి. 780 మంది దీని బారిన పడితే 468 మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

తీవ్రమైన జ్వరం కండరాల నొప్పులు తల నొప్పి గొంతులో పుల్లు మొదలైనవి వ్యాది లక్షణాలు . మనుషుల నుండి మనుషులకు బాడీ FLUIDS వాళ్ళ ఇది సంక్రమిస్తుంది . 

Read More