Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Saturday, August 30, 2014

PRIME MINISTER JAN DHAN YOJANA (PMJDY)





ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY ) తో ఒక్కసారి గా బ్యాంకు అధికారులు గ్రామాల్లో సేవింగ్స్ ఖాతాలు తెరిపించేందుకు బయలుదేరారు . రిజర్వు బ్యాంకు కూడా సేవింగ్ అకౌంట్ కు సంబంధించి కొన్ని నిమంధనలను సడలించింది . దేశంలోని ప్రతి  మనిషి బ్యాంకు ఖాతా కల్గి ఉండాలనే సదుద్దేశంతో భారత ప్రధాని మోడీ ఎర్రకోట పై ఈ స్కీం ను ప్రవేశపెట్టారు .

       PMJDY ఖాతా కల్గిన వ్యక్తి చనిపోతే 1 లక్ష బీమా సదుపాయం ఉంటుంది . దీనితో బ్యాంకు లు పోటి పడి ఊర్లలో చాటింపు వేసి ఖాతాలను తెరుస్తున్నారు . ఇప్పటికే మైక్రో బ్యాంకింగ్ తో కొన్ని బ్యాంకు లు మహాత్మాగాంధీ జాతీయ ఉపాది హామీ పథకం సంబందించిన చెల్లింపులు చేస్తున్నాయి .

     కొత్త లో SIM కార్డు కోసం కూడా అమౌంట్ ఛార్జ్ చేసేవారు టెలికాం ఆపరేటర్లు , వచ్చే కాల్స్ కు కూడా ఛార్జ్ చేసేవారు , తర్వాత  వచ్చిన పోటి వల్ల అన్ని ఫ్రీ గా ఇస్తున్నారు .

   సేవింగ్ ఎకౌంటు ఓపెన్ చేయాలంటే  బ్యాంకు ల కు వెళ్ళే పరిస్థితి గ్రామీణుల్లో ఆసక్తి తక్కువ , వాళ్ళు పెట్టె షరతులు అలాంటివి . ఇప్పుడు ఏదైనా ఓకే ఫోటో ఐడి ఉంటె సరిపోతుంది .  

ఇప్పటి వరకు ICICI బ్యాంకు 1 లక్ష ,IDBI  బ్యాంకు 3. 50 లక్షల ఖాతాలను PMJDY కింద ఓపెన్ చేయడం జరిగింది . 
Read More

Wednesday, August 27, 2014

తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ రావు

తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ రావు 


తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ భాజపా నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు ను భారత ప్రభుత్వం మహారాష్త్ర గవర్నర్ గా నియమించింది . కరీంనగర్ నుండి లోకసభకు పోటి చేసి ఓడి పోయిన విద్యాసాగర్ రావు ను మోడీ ప్రభుత్వం గుర్తించి గవర్నర్ పదవిని ఇవ్వడం శుభపరిణామం . ఎంతో కాలంగా పార్టీ కి ఆయన చేసిన సేవల కు గాను ఈ పదవి వరించింది . రాష్ట్ర శాఖా ఏర్పాటు చేసిన అభినందన సభ లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విద్యాసాగర్ రావు ను అభినందించారు . 

Read More

Sunday, August 24, 2014

ICE BUCKET CHALLENGE IS ROCKING IN INDIA

ఐస్ బకెట్ ఛాలెంజ్ ని మన దేశం లోని సెలెబ్రిటి  లు ఎంజాయ్ చేస్తున్నారు . అమెరికా లోని చారిటి కోసం ఐస్ బకెట్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని అక్కడి సెలబ్రిటీ లు  మరియు కంపెనీ సీఈఓ లు  పాల్గొని విజయవంతం చేసారు . ఆ వీడియోలు సోషల్ మీడియాలో బంపర్ హిట్ ఐయ్యాయి .

Read More

RABHASA TRAILORS


యంగ్ టైగర్ ఎన్టీఆర్  రభస సినిమా ట్రైలర్స్ 




Read More

Saturday, August 23, 2014

దేశం లోని మొదటి గ్రీన్ బస్సు



ఇండియా లోనే మొదటి సారి ఇథనాల్ తో నడిచే గ్రీన్ బస్సు ను నాగపూర్ లో ప్రారంభించారు. దీనిని స్వీడన్ కు చెందిన SCANIA కంపెనీ,ఇది  కమర్షియల్ వెహికల్ మరియు ఇంజిన్లను తయారు చేస్తుంది. సంవత్సరానికి 6 లక్షల కోట్లను పెట్రోల్ మరియు డీజిల్ దిగుమతి కి దేశం ఖర్చు పెడుతుంది , దీనిని 2 లక్షల కోట్లకు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఆధారిత వాహనాలను మరియు ఇథనాల్ ఆధారిత వాహనలకోసం నిధులు వెచ్చిస్తామని నితిన్ గడ్కారి  తెలిపారు . ఈ గ్రీన్ బస్సు ధర రూ . 1 కోటి    టాక్స్ లు లేకుండా . SCANIA కంపెనీ ఈ బస్సు లను   నార్వే  తో పాటు అనేక దేశాలకు సప్లై చేస్తుంది .  

Read More

Friday, August 22, 2014

నేటి తెలంగాణా పోలీస్ హీరో SP రంగనాథ్




ఖమ్మం లో  అనుమతి లేని  వడ్డీ వ్యాపారులపై మరియు ఫైనాన్సు వ్యాపారుల పై ఏక కాలంలో జిల్లా వ్యాప్తంగా SP రంగనాథ్ అధ్వర్యంలో  దాడులు జరగడం రాష్ట్రం లోని అక్రమ వడ్డీ వ్యాపారుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది . 
పాల్వంచ లో ఒక వడ్డీ వ్యాపారి ఇంట్లో 5 కోట్ల విలువైన తాకట్టు బంగారం స్వాదీనం చేసుకోవడం  తో ఏ రీతిన ఈ వ్యాపారం సాగుతుందో తెలిసి పోతుంది. 

రిజర్వు బ్యాంకు నిబందనలు ఉల్లంఘించి ఫైనాన్సు చేస్తున్న వారందరి డేటా ను SP రంగనాథ్  గారు ముందు గా సేకరించి  దాడుల చేయించారు .  ఖాళీ ప్రామిసోరి నోట్ పైన ,స్టాంప్ వేసిన వైట్ పేపర్ పైన సంతకాలు తీసుకోవడం  ఆ తర్వాత ఇష్టం వచ్చిన అమౌంట్ వేసుకొని కోర్ట్ నోటీసులు పంపడం వీరి అరాచకానికి పరాకాష్ట . 

   ఈ దాడుల వల్ల  కొన్ని వందల ఆత్మహత్య లను SP రంగనాథ్ ఆపివేయడం జరిగింది . ఉద్యోగుల దగ్గర నుండి ATM కార్డు లు తీసుకోవడం ,జీతం వచ్చిన తర్వాత వారి అనుమతి లేకుండా లేకుండా డ్రా చేసుకోవడం ,బ్లాంక్ చెక్కులు  పై సంతకం పెట్టించుకోవడం ఇవ్వకుంటే చెక్కు బౌన్సు కేసు పెడుతనని బెదిరించడం అక్రమ వడ్డీ వ్యాపారుల నిత్యకృత్యాలు. 

   వడ్డీ వ్యాపారులను ఎదుర్కోవడం అంటే అది మాములు విషయం కాదు ,వారి అంగ ,అర్థ బలం అలాంటిది 
ఇక రాజకీయ ఒతిళ్ళ గురించి చెప్పనక్కరలేదు .  వీటన్నిటిని లెక్క పెట్టకుండా ప్రజల కు నిస్వార్థంగా సేవ చేస్తున్న SP రంగనాథ్ అభినందనీయుడు. 

 RBI ఈ మధ్యనే అక్రమంగా  34000 కు పైగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సు కంపెనీస్ ఉన్నట్టు పేర్కొంది 
మిగతా జిల్లాల SP లు ఇదే తరహ దాడులు నిర్వహిస్తే మరింత మంది ని అప్పుల ఊబినుండి విముక్తులను చేసినట్టవుతుంది . అసలే కరువు తో నానా ఇబ్బందులు పడుతున్న జనాలకు ఈ అక్రమ వడ్డీ వ్యాపారులండి  అంతులేని నష్టం జరుగుతుంది . వీళ్ళు పెట్టె ఇబ్బందులకు మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది . 

RBI నిబందనలకు లోబడి చేసే వ్యాపారుల వాళ్ళ సమాజానికి ఎలాంటి నష్టం లేదు ,   కాని రూ 3 నుండి రూ 15 వరకు దౌర్జన్యంగా వడ్డీ వసూలు చేసే వారితో తీవ్ర ఆర్ధిక అసమానతలు ఏర్పడ్తాయి .  ఇది తెలంగాణా సమాజనికి 
ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు . 
Read More

Wednesday, August 20, 2014

లక్ష కోట్ల తో డిజిటల్ ఇండియా



దేశం లోని ప్రతి గ్రామపంచాయతి ని హై స్పీడ్ ఇంటర్నెట్ తో అనుసంధానం చేసే 'డిజిటల్ ఇండియా ' కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది . ఈ ప్రణాళిక కోసం లక్ష కోట్లు వెచ్చించి అన్ని రంగాల ప్రభుత్వసేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకోనిరనుంది . దీనిలో భాగంగా ప్రతి మారుమూల గ్రామానికి  విద్య, వైద్యసేవల్లో పురోగతి, డిజిటల్ అక్షరాస్యత ద్వారా గ్రామీణులకు విజ్ఞానాన్ని అందించటం, మొబైల్ కనెక్టివిటీ ,ఈ-గవర్నెన్స్ . ఉద్యోగాల కల్పనా, వ్యవసాయంలో ఐటి వినియోగం మదలైనవి ఈ ప్రణాళిక  లక్ష్యాలు. 
Read More

సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని కెసిఆర్ అన్నారు . దీనివల్ల ప్రజల కు ఎం కావాలో తెలుస్తందని పెర్కొన్నరు. జనసంఖ్య ,అక్రమ ఆస్తులు ,నకేలి రేషన్ కార్డ్స్  వెలుగులోకి వస్తాయి. ప్రాధమిక అంచనాల ప్రకారం 500 కోట్ల అదనపు ఆదాయాన్ని GHMC పొందబోతున్నట్టు తెలిసింది . మండలానికో డేటా సెంటర్ పెట్టి 2 వారాల్లో NIC అద్వర్యంలో పుర్హి డేటా ను అందుబాటులోకి తెస్తారు  



Read More

రేపు సమగ్ర కుటుంబ సర్వే

రేపు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు  తెలంగాణ ప్రభుత్వం  పకడ్బంది ఏర్పాట్లు చేసింది ఒక ఎనుమేరటర్ 30  కుటుంబాలను సర్వే చేయవలసి ఉంటుంది. ఇతర ప్రదేశాలలో నివసించే జనం అంత సొంత ఊళ్లకు చెరుకున్నరు. రేపు 9 గంటల కు అందరు ఇళ్ళ వద్దే ఉండాలని డప్పు చాటింపు చేయించడం జరిగింది.  

Read More

Friday, August 15, 2014

కరువు కోరల్లోకి తెలంగాణ

కరువు కోరల్లోకి తెలంగాణ 



తెలంగాణ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి దాపురించింది  ఆగష్టు నెల సగం గడిచిన వాన దేవుడు కనికరించలెదు. 
పోచమ్మ బోనాల రోజు వర్షం  పడటం ఆనవాయితి కానీ ఈ సారి అది జరుగలేదు బావుల కింద చేసే వ్యవసాయం కూడా ఆశించిన స్థాయిలో పండక పోవచ్చు ఎందుకంటే కరెంటు ప్రాబ్లం వల్ల . మేఘ మధనం లాంటి వేమైన చేస్తారంటే దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా లేదు 

కరువు ను ఇంకా గుర్తించక పోవడం శోచనీయం. కరువు పరిస్థితి వస్తే ఎం చేయాలి రైతులను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక ప్లాన్ వ్యవసాయ అధికారుల కు లేకపోవడం నిజంగా తెలంగాణా ప్రజల బాడ్ లక్. 




Read More

Saturday, August 2, 2014

Country wise Petrol prices per Litre

Pakistan. Rs 26.00Bangladesh Rs 22.00Cuba Rs 19.00Italy. Rs 14.00Nepal. Rs. 34.00Burma. Rs. 30.00Afghanistan. Rs 36.00Sri Lanka. Rs. 34.00INDIA. Rs. 82.00How it comes to this......Basic cost per 1litre. 16.50+ Centre Tax. 11.80%+ Excise Duty. 9.75%+ Vat Cess. 4%+ State Tax. 8%Total added up together becomes Rs 50.05 per 1 litre. + now another Rs 32. Extra. This 32/- extra for what no explaination for this.What a great job by the GOVT. Of INDIA

Read More