Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Thursday, October 25, 2018

అన్ని దారులు మూసుకుపోయి నోటికి పని చెబ్తున్న దొర


1. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తుంటే ఆంధ్రోడు అడ్డపడిండా!
2. దళితులకు 3ఎకరాలు ఇస్తావుంటే ఆంధ్రుడు అడ్డపడిండా!!
3. కేజీ to పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తుంటే ఆంధ్రోడు అడ్డపడిండా!!
4. లక్ష కొలువులు భర్తీ చేస్తూ.. ఇంటికొక ఉద్యోగం ఇస్తుంటే ఆంధ్రోడు అడ్డపడిండా!!
5. ఇంటిటికి నీరు ఇస్తావుంటే ఆంధ్రోడు అడ్డపడిండా!!
6) మైనార్టీ, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తావుంటే ఆంధ్రోడు అడ్డుపడిండా!!
7) హైదరాబాద్ లో అంబేద్కర్ స్టడీ సర్కిల్, బంజార భవన్, క్రిస్టియన్ భవన్, జర్నలిస్టు భవన్ కడుతుంటే ఆంధ్రోడు అడ్డుపడిండా!!
8) హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేసి అమరవీరుల స్మ్రుతివనం కడుతుంటే ఆంధ్రోడు అడ్డుపడిండా!!
9) పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తుంటే
కరీంనగర్ ను లండన్ గా మారుస్తుంటే
వరంగల్ ను డల్లాస్ చేస్తుంటే
ఆంధ్రోడు అడ్డుపడిండా!!
10) మహిళలకు మంత్రి పదవి ఇచ్చి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఆంధ్రోడు అడ్డుపడిండా!!
వీటన్నింటికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేక..
ఆంధ్రోడు మీద నింద వేసి అమాయక తెలంగాణ ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి సిద్ధమయిన ఓ కేసీఆర్..
విడిపోయీ అన్నదమ్ములుగా ఉందామని చెప్పి..విద్వెషాలు రెచ్చగొట్టే కేసీఆర్ ను తరిమిగొట్టండి...
తెలంగాణ ప్రజలరా...
మోసాల మరాఠి మాటలు నమ్మి మోసపోయి గోసపడుతున్నం
మళ్లీ నీ మాటలు నమ్మేంత పిచ్చి వారు కాదు తెలంగాణ ప్రజలు అని వ్యతిరేక ఓటు ద్వారా కర్రు కాల్చి వాత పెడుదం
ఇట్లు:-
దాసరి ప్రవీణ్ కుమార్ నేత
జిల్లా ప్రధానకార్యదర్శి(వర్కింగ్)
తెలుగుదేశం పార్టీ-కరీంనగర్
Read More

న‌మ్మ‌క‌మైన స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు. తెలంగాణ‌లో అధికారం వీరిదే...

ఐదు సంవ‌త్స‌రాలు పాలించే అవ‌కాశం ఉన్నా, కేసీఆర్ ఎందుకు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్న‌ట్లు అన్న అనుమానాలు అప్ప‌ట్లో అందరిలోనూ వ్య‌క్త‌మ‌య్యాయి. కేసీఆర్ ఎదో బ‌ల‌మైన కార‌ణం లేనిది అధికారాన్ని వ‌దులుకొని, మ‌ళ్లీ అదే అధికారం కోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఎందుకు వెళ్తాడు అన్న అంశం పై అనేక ర‌కాల చ‌ర్చ‌లు, వాదోప‌వాదాలు జ‌రిగినా…ప్ర‌తిప‌క్షాల‌ను నామ‌రూపాలు లేకుండా చేసి, మ‌ళ్లీ గెలుస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్న వాద‌న బ‌లంగా తెర‌పైకి వ‌చ్చింది. పైగా స‌ర్వేల‌న్నీ ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టంతో కేసీఆర్ ఆల‌స్యం చేయ‌కుండా అసెంబ్లీని ర‌ద్దుచేసి, ప్ర‌జ‌ల ముందుకొచ్చాడు.
కానీ... అప్పుడ‌నుకున్న‌ట్లు ఇప్పుడు విప‌క్షాలు చెల్లాచెదురుగా లేవు. అన్నీ ఒక్క‌ట‌య్యాయి. కాంగ్రెస్-టీడీపీ క‌లిసి పోటీచేస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. అస‌లు అది ఊహ‌కంద‌నిది. వీటికి తోడు తెలంగాణ ఐకాన్ కోదండ‌రాం టీజెఎస్, తెలంగాణ‌కు మ‌ద్దితిచ్చిన సిపిఐ కూడా మ‌హ‌కూట‌మికి జై కొట్ట‌డంతో… ప‌రిస్థితి మారిపోయింది. పైకీ మీడియా పెద్ద‌గా చూపించ‌క‌పోయినా, గ్రౌండ్ లో రియాల్టీ మారుతుంద‌న్న‌ది స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. మ‌హకూట‌మి ఏర్ప‌డ్డ త‌ర్వాత ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన ఓ సంస్థ చేసిన స‌ర్వే… విస్తుపోయే నిజాలను బ‌య‌ట‌పెట్టింది. ఈ సంస్థ‌కు అత్యంత న‌మ్మ‌క‌మైన స‌ర్వేగా పేరుండ‌టం విశేషం. ఉత్త‌రాదికి చెందిన డీవోటర్స్ టుడే అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అధికారం చెలాయించిన టీఆర్ఎస్ పార్టీకి కేవ‌లం 30 నుండి 35 మాత్ర‌మే వ‌స్తాయ‌ని తేలింది. అందులోనూ 22 స్థానాలు ప‌క్క గా గెలిచి తీరుతుంద‌ని, మిగిలిన వాటిలో ఎక్కువ‌గా విజ‌యావ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. మ‌రోవైపు మ‌హ‌కూట‌మికి మాత్రం అత్యంత బూస్ట్ ఇచ్చేలా… భారీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపింది.
మ‌హ‌కూట‌మి మొత్తం 75 - 78 స్థానాల‌కు పైగా కైవ‌సం చేసుకొని, అధికారం చేప‌డుతంద‌ని స‌ర్వే తేల్చింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ప్ర‌స్తుతం ఉన్న 5 సీట్ల‌లో 3 సీట్లు కోల్పోయి కేవ‌లం 2 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. గ‌తంలోలాగా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సెంటిమెంట్ ఇక ప‌నిచేయ‌ద‌ని, అందుకే టీఆర్ఎస్ కు కాలం చేల్లింద‌ని కూడా తేల్చింది. ప్ర‌జ‌లు అభివృద్దిని కోరుకుంటున్నార‌ని, కేవ‌లం మాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యే పార్టీల‌ను కాదంటున్న‌ట్లు డీ-వోట‌ర్ స‌ర్వేలో వెల్లడయ్యింది.
( పల్స్ ఆఫ్ తెలంగాణా)
Read More

లిక్కర్ లో టాప్...లిట్రస్రీలో ఫ్లాప్


Read More

పతనం దిశగా తెరాస..!

ఎన్నికల ఫలితాల కోసం డిసెంబరు 11 వ తేదీ వరకు ఆగాల్సినపనిలేదు.
నవంబరు 11 కంటే ముందుగానే, దరిదాపు అక్టోబరు 20 నుండీ 27 మధ్యనే జాతకాలు తెలిపోయేటట్లు కనిపిస్తోంది.
ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో తెరాస నాయకులు ఎదుర్కొంటున్న తీవ్ర ప్రజావ్యతిరేకతను ప్రజాప్రతిఘటనలను పార్టీలో అసమ్మతి తిరుగుబాట్లను హైదరాబాద్ మీడియా ఎంతగా తొక్కిపెట్టాలని చూసినా అది సాధ్యపడకపోగా రోజురోజుకి రెట్టింపు అవుతోంది.
తీవ్ర నిరాశ నిస్పృహలతో తెరాస అభ్యర్థులు ఈ విషయాన్ని కొంతమంది ముఖ్యనాయకుల అధినాయకత్వం దృష్టికి తీసుకువస్తే అంతర్గత సంభాషణగా వారి ముందు పార్టీ ముఖ్యులు రాబోయే ఎన్నికలలో తమ ఓటమిని అంగీకరించారని, గరిష్టంగా 25 సీట్లు మించి రాకపోవచ్చని అన్నట్లు విశ్వసనీయ సమాచారం.
దీనితో ఖంగుతిన్న చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నాయకులు తమ ప్రత్యామ్నాయ భవిష్యత్ ప్రణాళికలు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.
వీరిలో చాలామంది కాంగ్రెస్ తెదేపా అధినాయకత్వం ముందు క్యూ కడుతున్నారు, కొంతమందైతే మీ పార్టీలోకి మమ్మల్ని రానిస్తే చాలు, మాకు ఎటువంటి పదవులు అవసరంలేదు అని బ్రతిమాలుకుంటున్నారు.
తెరాసలోని ఒక ముఖ్యనాయకుడు అయతే ఎన్నికల ఫలితాలు వెలువడినాక నాతోపాటు ఎక్కువమంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చి మీతో చేరతాను, నాకు ఏ పదవి ఇస్తారో హామీ ఇస్తే వస్తాను అని ఢిల్లీతో రాయబారాలు నడిపిస్తున్నారు.
అక్టోబరు 20 వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో ఒక కీలక మంత్రి, మరొక కీలక ఎంపీ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోబోతున్నారు.
మరలా రాహుల్ గాంధీ అక్టోబరు 27 వ తేదీన వస్తున్న సందర్భంగా మరొక ఇద్దరు / ముగ్గురు కీలక మంత్రులు, ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇందుకొరకె మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన ఏర్పడుతోందని తెలుస్తోంది.
కేసీఆర్ ఏనాడూ ఊహించని రీతిలో తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు జట్టుకట్టడంతో దిక్కుతోచని పరిస్థితిలో తీవ్ర నైరాశ్యంలో కావాలనే కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ప్రేలాపనలు చేస్తున్నాడని అనుకోవచ్చు.
చంద్రబాబుని టార్గెట్ చేయడం ద్వారా భయపడిన హైదరాబాద్ ఆంధ్రులు మొన్న జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ ఎన్నికలలో తెరాసకు ఓటేశారని, ఇప్పుడు కూడా అలాగే వేస్తారనే పిచ్చి భ్రమలో కేసీఆర్ ఉండడం విడ్డూరం.
తెలంగాణలో *పాయింట్ ఫైవ్* శాతం మాత్రమే జనాభా బలం ఉన్నటువంటి కేసీఆర్ & అతని కుటుంబము అధికారమదంతో గత నాలుగేళ్లుగా చేసిన అరాచకాలు కొవ్వెక్కిన మాటలు చూసిన కోటిమంది ఆంధ్రులు తగు సమయం కోసం వేచి చూస్తూ మౌనంగా అన్నీ భరించారు.
చంద్రబాబు నాయుడు మీద తండ్రీ కొడుకు కూతురు మేనల్లుడు ఏమాత్రం గౌరవం మర్యాదలు ఇంగితజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా అవాకులు చెవాకులు హేళనలు దూషణలు చేసినప్పుడే కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు.
ఆంధ్రులు ఎప్పటికీ ఛీ కొట్టే ఒక గొంగళిపురుగు లాంటి కేసీఆర్ ని సాటి సోదర పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని గౌరవంతో అమరావతి నగర నిర్మాణ శంఖుస్థాపనకి ఆహ్వానించి అతని పేరు శిలాఫలకం మీద వ్రాయించినా కూడా తన సహజబుద్ధి పోనిచ్ఛుకోకుండా కుట్రలు వెన్నుపోట్లకు మోసానికి మారుపేరైన కేసీఆర్ తన ఆంధ్రా వ్యతిరేక నిజస్వరూపం నిరూపించుకుంటూనే ఉన్నారు.
చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని కేసీఆర్ & కో అన్న ప్రతిమాటా, చేసిన హేళనలు, అవాకులు చవాకులు తెలంగాణలో ప్రతి ఆంధ్రుడూ తనని అన్నట్లుగానే ప్రతి ఆంధ్రుడు భావిస్తున్నారు.
గత నాలుగేళ్ల నుండీ ఇంతవరకూ ఏనాడూ కూడా కేసీఆర్ & కో కుసంస్కారంగా ఎన్ని మాట్లాడినా శ్రీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని అతని మనుషుల్ని తిరిగి పల్లెత్తి మాట కూడా అనలేదు, అది చంద్రబాబు యొక్క సంస్కారాన్ని తెలంగాణ ప్రజలకు, ప్రపంచానికి తెలియచెప్పింది.
నేడు తెలంగాణ ప్రజలు యావత్తూ నిరంతరం అనుకుంటున్న / తలచుకుంటున్న సామెత "కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోపెట్టినట్లుంది" అని.
కేసీఆర్ ఎప్పుడూ కూడా.. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమని ప్రతి ఆంధ్రుడికి తెలుసు.
అది అనాదిగా చంద్రబాబు / తెదేపా, సోనియాగాంధీ కాంగ్రెస్, అద్వానీ / బీజేపీ / మోడీ ల విషయంలో కేసీఆర్ బృటస్ పాత్ర తెలియనిది కాదు.
తెలంగాణలో పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే ఉన్నటువంటి కేసీఆర్ కులం ఓట్ల ద్వారా అతను ముఖ్యమంత్రి కాలేదు.
కేవలం మాయమాటలు వెన్నుపోట్లు అవకాశవాదం మోసంతోనే ఇన్నాళ్లూ అతను అతని వర్గం పాలిస్తోంది.
నేడు తెలంగాణను ఆర్ధికంగా సర్వనాశనం చేసి 70 ఏళ్ల వెనక్కు నెట్టింది కూడా వీళ్ళే.
ఇప్పుడు కేసీఆర్ మరియ అతని కొడుకు, కూతురు హైదరాబాద్ కిరాయి మీడియా ద్వారా ఎన్ని శాంతివచనాలు నీతిసూక్తులు పలికినా కూడా మేకవన్నె పులుల్లాంటి ఈ కుటుంబాన్ని / ఆ కులాన్ని నమ్మడానికి వినడానికి తెలంగాణా ప్రజలు, తెలంగాణలోని ఆంధ్రా ప్రజలు సిద్ధంగాలేరు.
ఇంకెన్నోరోజులు వీళ్ళు ప్రజల్ని బెదిరించి అదిరించి మోసగించి పోలీసుల పహారాలో అక్రమ కేసులతో, కిరాయి మీడియా ముసుగులో పాలించలేరు.
తెలంగాణాలో కేసీఆర్ & కో గత నాలుగేళ్లలో ప్రతి గడపగడపకు చేసిన తీవ్ర అన్యాయము దగా మోసము దోపిడీ ఇంతా అంతా కాదు.
అమాయక ప్రజల్ని యువతను తన మాయమాటలతో నమ్మించి నిట్టనిలువునా ముంచారు.
నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచారు, యువత జీవితాలను చిదిమేశారు.
రైతుల్ని కల్తీ ఎరువులు పురుగుమందులతో వంచించారు, గిట్టుబాటు ధరలు ఆడిగితే బేడీలు వేసి జైళ్లలో పెట్టారు.
ఇసుక మాఫియా లారీలతో దళితుల్ని తొక్కించి చంపించారు.
కోదండరాం ఇంటిని అర్ధరాత్రి పోలీసులతో పగలకొట్టించి అతన్ని అరెష్టు చేశారు.
అమరవీరులను మరిచారు.
తెలంగాణ పోరాటాయోధుడు బలహీనవర్గానికి చెందిన కీశే కొండా లక్ష్మణ్ మృతిచెందితే పరామర్శకు వెళ్ళలేదు.
కొండగట్టు క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను కనీసం పరామర్శించలేదు.
ఇలాంటి చెప్పాలంటే ఒక పుస్తకమే వ్రాయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నగరం చుట్టుపక్కల రియలేస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై పోలీసులతో ప్రజల్ని బెదిరించి భయపెట్టి అక్రమ కేసులు పెట్టి వందలాది ఎకరాల భూములు ఆక్రమించారు.
చెరువులు వాగులు వంకలు పూడ్చిన అక్రమ లే అవుట్లకు అనుమతులు ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరుతో నిరుపయోగమైన ప్రాజెక్టులు కట్టిస్తూ కనీసం లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, జిల్లాకోకటి నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హెలికాఫ్టర్ అంబులెన్సులు, హుస్సేన్ సాగర్ ని మినరల్ వాటర్ తో నింపి దానిచుట్టు వంద అంతస్తుల ఆకాశ హార్మ్యాలు, కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రెటరీయేట్, కొత్త ఉస్మానియా ఆసుపత్రి, కొత్త రవీంద్రభారతి, నగరాల్లో స్కైవేలు, రింగురోడ్లు, హైదరాబాద్ కి మరో అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి ఉత్తుత్తి హామీలు కేసీఆర్ ఇఛ్చినవి కోకొల్లలు.
ఇవన్నీ ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు, ఇవన్నీ పిట్టలదొర మాటలని నవ్వుకున్నారు అంతే !
ప్రజలు అంత అమాయకులు కాదు, ప్రజలు కేసీఆర్ కంటే విజ్ఞులు.
సమయం చూసి కర్రుకాల్చి వాతలు పెడతారు.
ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది, కేసీఆర్ దొర కి & అతని కుటుంబానికి & అతని అనుచరులకు తెలంగాణప్రజలు దళితులు బలహీనవర్గాలు యువత నిరుద్యోగులు వ్యాపారులు కర్రుకాల్చి వాతలు పెట్టడానికి సిద్ధపడ్డారు, ఎవ్వరూ వాళ్ళను ఆపలేరు, వీళ్ళను కాపాడలేరు.
హైదరాబాద్ కిరాయి మీడియా ఇప్పటికైనా విజ్ఞతతో సంస్కారంతో భ్రమల్లో నుండీ వాస్తవాల్లోకి వచ్చి,
ఆ కుటుంబ కిరాయి భజనల్లో నుండీ ప్రజల్లోకి వచ్చి, ప్రజాబాహుళ్య ఆకాంక్షలకు అనుకూలంగా మీ కలాలు గళాలు వినిపిస్తే మీకు మర్యాద గౌరవం నిలుస్తాయి.
అలాకాకుండా నేటి నుండి 20 రోజుల తరువాత మీరు మహాకూటమికి అనుకూల వార్తలు ప్రచురించాల్సిన, ప్రసారం చేయాల్సిన పరిస్థితి తప్పదు. అప్పుడు రేపు మీరు నవ్వులపాలు అవ్వడం, మీకు శృంగభంగం అవ్వడం ఖాయం.
మొన్న రేవంత్ రెడ్డి మీడియాను బహిరంగంగా ప్రశ్నిస్తే ప్రజలు హర్షించారు. అతను మీడియాలోని కొందరి డీ ఎన్ ఏ ని ప్రశ్నిస్తే సమాజం రేవంత్ ని శెభాష్ అంది.
ఈరోజు మీ మీడియాకంటే సోషల్ మీడియా, వాట్సప్ లలో ప్రజలు నేరుగా, మీకంటే వేగంగా వాస్తవాలు వార్తలు చేరవేసుకుంటున్నారు.
మీకంటే సోషల్ మీడియానే చాలా బాధ్యతాయుతంగా నిఖార్సుగా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తోంది.
ఆపద్ధర్మ తెలంగాణ ప్రభుత్వము, మీరు, పోలీసులు చేరి సోషల్ మీడియా, వాట్సాప్ లను కట్టడిచేయాలని చూస్తే సమాజం తిరగబడడం ఖాయం.
కేసీఆర్ అనుకూల హైదరాబాద్ మీడియా నేటికైనా ఆత్మవిమర్శ చేసుకుని, మహాకూటమికి వ్యతిరేక వార్తల్ని వండి వార్చకుండా, తెలంగాణా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా కేసీఆర్ నియంతృత్వ పాలన, కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా వాస్తవాలను సమాజానికి అందించి మీ నిజాయితీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
ఈ పోస్టు నా మిత్రులలో ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే మాత్రం నేనేమీ చేయలేను, ఇది పూర్తిగా నా మనస్సాక్షిగా అంతా నిజమని యదార్ధమని నిష్పక్షపాతమని తలచి పూర్తి స్పృహతో తెలంగాణ సమాజాహితం కోరి,తెలంగాణ ప్రజాహితార్ధం వ్రాసాను అని మనవి.
జై తెలంగాణ.
Read More

టి.యర్.యస్ పార్టి ఇవ్వబోయే నిరుద్యోగభృతి వివరములు

1. డిగ్రి పాస్ అయి ఉండాలి.2.వయస్సు 35సం. లోపు మరియు వివాహం అవ్వకూడదు.3.ఎటువంటి గౌర్నమెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ జాజ్ కూడా చేయకుడదు.4. ఎటువంటి భూమి కలిగి ఉండకూడదు, కుటుంబ సభ్యులకి కూడా భూమి ఉండకూడదు.5.కుటుంబ సంభ్యులకి గాని, అభ్యర్దికి గాని ఎటువంటి ప్రైవేట్ వ్యాపారలు కలిగి ఉండకూడదు6.అభ్యర్ది పేరు పైన ఎటువంటి వాహన రెజిస్ట్రషన్ ఉండకుడదు.

Read More

FACE BOOK COMMENTS ON KCR- KCR IS LION -KTR

సచివాలయానికి ఎన్నడూ రానోడు సింహమా?ఉస్మానియా క్యాంపస్ లో అడుగు పెట్టలేనోడు సింహమా?ఫార్మ్ హౌస్ లో పడుకునేవాడు సింహమా ?దళితుడిని సీఎం చేయనోడు సింహమా?కొండగట్టు బస్సు ప్రమాదం లో మృతిచెందిన సంఘటనలో రానందుకు సింహమా? ఇచ్చిన హామీలు నెరవేర్చనోడు సింహమా?? మహిళ మంత్రిని చేయనోడు సింహమా?? రైతులకు కు సంకెళ్లు వేసినోడు సింహమా?? ఆడ బిడ్డల ను జైల్లో పెట్టినోడు సింహమా?? చాంతాడు జాతకం ఉంది ఈ తాజా మాజీ సీఎం సింహం కాదు సోంబేరి.

Read More