కెసిఆర్ కు ఋణ మాఫీ చిక్కు ?
తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కి ఆదిలోనే రుణ మాఫీ విషయం లో విపక్షాల నుండి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతుంది. ఏదైనా కంపెనీ ప్రకటన ల లో ఒక * గుర్తు కన్పిస్తుంది , దాని క్రింద షరతులు వర్తిస్తాయని ఉంటుంది . ఇక్కడ తెరాస వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ ముఖ్యమైనది. అధికారం లోకి వచ్చిన తరువాత విధిస్తున్న ఋణ మాఫీ షరతుల విషయం లో మాత్రం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుండి కెసిఆర్ మాట ను 100% నమ్మిండ్లు కాబట్టి . మన తెలంగాణ గాంధీ గారు ఎన్ని కష్టాలకు ఒర్చుకోనైన ఋణ మాఫీ ని అమలు చేయాల్సిన ఆవశ్యకం ఉన్నది. ఎందుకంటే రైతు లు ఎలాంటి షరతుల ను ఒప్పుకోవడం లేదు.మరి కొన్ని రోజుల్లో ఋతుపవనాలు తెలంగాణను తాకబోతున్నాయి ఈలోపు ఋణ మాఫీ సమస్యను పరిష్కరిస్తే రైతులు వాళ్ళ పని వారు చేసుకుంటరు లేదంటే ధర్నాలు ఆందోళనలు చేస్తరు ప్రతిపక్షాలకు ఆవకాశం ఇచినట్లవుతుంది . తెలంగాణ గాంధీ గారు తెలంగాణా ప్రజల ఆలోచనలకూ అనుకూలంగా పని చేస్తారని ఆశిద్దాం .
మీరు మీ ఆర్టికల్స్ ను పంపదల్చుకుంటే teamexperts@rediffmail.com పంపండి
